The Committee of Administrators could summon Indian women's team skipper Harmanpreet Kaur and Mithali Raj following the latter's controversial omission from the ICC Women's World T20 semifinal against England - a match that they lost by eight wickets.
#MithaliRaj
#HarmanpreetKaur
#Women'sWorldT20
#COA
#ICC
వరల్డ్ టీ20లో ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌కు తుదిజట్టు నుంచి తప్పించడంపై అన్ని వైపులా విమర్శల వర్షం కొనసాగుతూనే ఉంది. తాజాగా, మిథాలీ రాజ్‌ను ఆడించకుండా తప్పించిన వివాదంపై వివరణ కోరాలని క్రికెట్ పరిపాలకుల కమిటీ (సీఓఏ) నిర్ణయించింది.
ఇందులో భాగంగా భారత మహిళల జట్టు స్వదేశం తిరిగొచ్చిన తర్వాత దీనికి సంబంధించి మిథాలీ, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, కోచ్ రమేశ్ పొవార్, మేనేజర్ తృప్తి, సెలక్టర్ సుధ షాలతో సీఓఏ బృందం విడివిడిగా మాట్లాడనుంది. మరోవైపు వరల్డ్ కప్‌లో మిథాలీని ఫిట్‌నెస్ ఎలా ఉందనే అంశంపై నివేదక సమర్పించాలంటూ కోచ్ రమేశ్ పొవార్, మేనేజర్ తృప్తి భట్యాచార్యలను క్రికెట్ పరిపాలకుల సంఘం(సీవోఏ) ఆదేశించింది. దీనిపై జట్టు మేనేజర్ తృప్తి భట్యాచార్య సోమవారం బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రికి నివేదిక ఇవ్వనుంది. దీంతో పాటు టీ20లో భారత జట్టు ప్రదర్శనపై పూర్తిస్థాయి నివేదికతో సోమవారం తమ ముందు హాజరు కావాలని సీవోఏ పేర్కొన్నట్లు తెలుస్తోంది.